»Sahil Khan Bollywood Actor Arrested In Betting App Case
Sahil Khan: బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతనిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేశారు.
Sahil Khan: Bollywood actor arrested in betting app case
Sahil Khan: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతనిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేశారు. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ అతను ముందుగా బెయిల్ పిటిషన్ వేశారు. దీనిని బాంబే హైకోర్టు తిరస్కరించడంతో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. సాహిల్‌కు గతేడాది సమన్లు జారీ చేశారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఒక సెలెబ్రిటీగా మాత్రమే యాప్‌కు బ్రాండ్ ప్రమోటర్‌గా పనిచేశానని.. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
దీని కోసం యాప్‌తో ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. అయితే ఈ యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కానీ ఇతను బెట్టింగ్ యాప్ సహ-యజమాని అని పోలీసులు చెబుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ఫేక్. పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారాయని, నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించారని కోర్టు విచారణలో తేలింది. దీంతో అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు తీర్పునిచ్చింది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ వల్ల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్‌లను సృష్టించి క్రికెట్, ఫుట్‌బాల్, తీన్ పత్తీ వంటి ఆటల్లో గ్యాంబ్లింగ్ చేశారు. సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించారు. దీంతో సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారింది.