»30 Year Gap Srileelas Romance With 53 Year Old Hero
Srileela: 30 ఏళ్ల గ్యాప్.. 53 ఏళ్ల హీరోతో శ్రీలీల రొమాన్స్?
యంగ్ బ్యూటీ శ్రీలీలకు ఓ గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఇదెక్కడి కాంబో అని మాత్రం అనుకుంటారు. ఎందుకంటే.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 30 ఏళ్లు ఉంది.
30-year gap.. Srileela's romance with 53-year-old hero?
Srileela: ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవర్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాత్రమే ఉంది. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక.. కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తూ.. బిజీ బిజీగా ఎడాపెడా సినిమాలు చేసిన శ్రీలీలకు.. హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా వచ్చాయి. అలాగే పర్ఫార్మెన్స్ ఓరియెంటేడ్ క్యారెక్టర్ ఒక్కటి కూడా పడలేదు. శ్రీలీల చేసిన సినిమాల్లో డ్యాన్స్‌కు ఇచ్చిన ఇంపార్టెన్స్ తన పాత్రకు ఇవ్వలేదు. భగవంత్ కేసరి తప్పితే.. మిగతా సినిమాలేవి శ్రీలీలకు పెద్దగా కలిసి రాలేదు. చివరగా వచ్చిన గుంటూరు కారంలో డ్యాన్స్ ఇరగదీసింది. అంతే తప్ప.. ఈ సినిమా మరో కొత్త ఆఫర్‌ను మాత్రం తీసుకురాలేదు. దీంతో ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది శ్రీలీల. ఇక నుంచి తన పాత్రలకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు చేయాలనుకుంటోంది.
ఇలాంటి సమయంలో.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో ఛాన్స్ అందుకుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాని అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో అజిత్ సరసన హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో.. అసలు ఈ కాంబో ఎలా సెట్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏజ్ పరంగా చూస్తే.. శ్రీలీలకు 23, అజిత్‌కు 53 ఏళ్లు ఉంటాయి. అంటే.. ఇద్దరి మధ్య 30 ఏళ్ల గ్యాప్ ఉంది. కాబట్టి.. అజిత్ పక్కన శ్రీలీల సెట్ అవడం కష్టమే. అయితే.. ఒకవేళ గుడ్ బ్యాడ్ అగ్లీలో శ్రీలీలను తీసుకుంటే.. భగవంత్ కేసరి సినిమాలో లాగా మరో కీ రోల్ కోసం తీసుకొని ఉంటారు. కానీ హీరోయిన్గా మాత్రం ఛాన్స్ లేదని అంటున్నారు. లేదు హీరోయిన్గా చేస్తే.. శ్రీలీలకు ఇంతకుమించిన బంపరాఫర్ ఉండదనే చెప్పాలి. కానీ ఎలా మ్యానేజ్ చేస్తారనేది మేకర్స్‌కే తెలియాలి.