అమెరికాలోని సౌత్ రీసెర్చ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కాఫీలోని కెఫీన్, లివర్ సమస్య మధ్య ఉన్న సంబంధంపై పరిశోధన చేశారు. కామెర్లు, మద్యపానం అలవాటు ఉన్నవాళ్లలో కాలేయంలోని టిష్యూలు దెబ్బతింటాయి. మధుమేహ బాధితులకైతే కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల కాలేయ సమస్య వస్తుంది. కాఫీలోని కెఫీన్ ఈ ఫైబర్ కణాల ఉత్పత్తిని అడ్డుకుని కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు.