»Rains In Telangana For Four Days Yellow Alert Issued For Those Districts
Yellow alert: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాల వారిగా తెలుపుతూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Rains in Telangana for four days. Yellow alert issued for those districts
Yellow alert: తెలంగాణలో పలు జిల్లాలో వర్ష సూచనలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్‌లో హెచ్చరించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఆదివారం అర్థ రాత్రి నుంచి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లు పడే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే సోమవారం, మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డిలో వానలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మంగళవారం, బుధవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో కాస్త మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే గురువారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.