Whatsapp: Images can now be created on WhatsApp with AI
Whatsapp: మెటా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోకి అడుగుపెట్టింది. వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఏఐని ఇంటిగ్రేట్ చేసింది. లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా పనిచేస్తుంది. దీంతో చాట్‌జీపీటీలా మెటా ఏఐ చాట్‌బాట్ ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం ఇస్తుంది. అలాగే ఇక వాట్సాప్‌లో ఏఐ సాయంతో రియల్‌టైమ్ ఇమేజ్‌లను రూపొందించవచ్చని మెటా తెలిపింది. మెటా ఏఐ సాయంతో టెక్ట్స్ అందిస్తే చాలు సులువుగా ఇమేజ్ జనరేట్ చేయవచ్చు. క్వాలిటీ మిస్ కాకుండా ఫొటోలను యానిమేట్ చేయవచ్చు. మెటా ఏఐ సాయంతో వెబ్‌లో కూడా ఈ సేవల వినియోగించుకోవచ్చు.
మనం ఏ చిత్రాన్నైన ఉహించుకుని టెక్ట్స్ రూపంలో ఏఐ అసిస్టెంట్‌కు తెలిపితే చాలు అదే ఇమేజ్ను జనరేట్ చేస్తుంది. జీఐఎఫ్ మార్చే ఫీచర్ కూడా ఇందులో ఉందని తెలిపింది. ప్రాంప్ట్‌లు, సూచనలను అందిస్తుందని మెటా చెబుతోంది. దేశంలో కొందరు యూజర్లకు ఈ ఫీచర్ దర్శనమిస్తోంది. వాట్సాప్ చాట్ మెనూలో వివిధ రంగులతో కూడిన వృత్తాకారంలో మెటా ఏఐ ఐకాన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్ అంటూ ఓ పాప్ఆప్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూపై క్లిక్ చేస్తే మెటా ఏఐతో చాట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ చాట్ మెనూలో వివిధ అంశాలకు సంబంధించిన చాట్‌జీపిటీ విధానంలో ప్రశ్నలకు సమాధానమిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.