»Realme The Phone In The Realme P Series These Are The Features
Realme: రియల్మీ P సిరీస్‌లోని ఫోన్, ఫీచర్లు ఇవే!
చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ రియల్మీ పి సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లలను లాంచ్ చేసింది. పి1 5జీ, పి1 ప్రో 5జీ పేరుతో రెండు ఫోన్లను తీసుకచ్చింది. మరి ఈ 5జీ ఫోన్ల ఫీచర్లేంటి? ధరెంత? విక్రయాలు ఎప్పటి నుంచి? అనే వివరాలు తెలుసుకుందాం.
Realme: రియల్మీ పీ1 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.18,999గా పేర్కొంది. ఇక రియల్మీ పీ1 ప్రో సైతం రెండు వేరియంట్లలో వస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.21,999, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ పేర్కొంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది. ఏప్రిల్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. రెండింట్లోనూ ఒకలాంటి ఫీచర్లు ఉన్నాయి.