Ms Dhoni fan : మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతో అభిమానం ఉన్న ఓ వ్యక్తి చేసిన పనికి అంతా ముక్కున వేలేసుకున్నారు. మరీ ఇంత పిచ్చి అభిమానం ఎందుకయ్యా బాబు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్లో కోల్‌కతా – చెన్నై మ్యాచ్ కోసం ఓ వీరాభిమాని ఏకంగా 64,000 పెట్టి బ్లాక్‌లో టికెట్లు కొని మ్యాచ్ చూశాడు. అది మామూలు డబ్బు అయితే పెద్దగా చెప్పుకోవలసింది ఏమీ కాదు. అయితే తన కూతుళ్ల స్కూలు ఫీజు(school fee) కట్టడానికి ఉంచిన డబ్బుతో ఆ అభిమాని ఈ పని చేశాడు.
అలా స్కూలు ఫీజుతో కొన్ని టిక్కెట్లతో కోల్‌కతా-చెన్నై మ్యాచ్‌ని తన ముగ్గురు పిల్లలతో కలిసి చూశాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఆడుతున్న ధోనీ ఆటను తన ముగ్గురు పిల్లలతో కలిసి చూశానని వారు చాలా ఆనందించారని అతడు చెప్పుకొచ్చాడు. ధోనీ(dhoni) ఆటను ప్రత్యక్షంగా చూడాలన్న ఆశతోనే తాను ఈ పని చేసినట్లు తెలిపాడు. దీంతో ఇప్పుడు అతడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.
అయితే అతడు ఈ పని చేయడంతో నెట్లో చాలా మంది అతడిపై దుమ్మెత్తి పోస్తున్నారు. తిట్ల వర్షం కురిపిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సింది పోయి ఇలాంటి పిచ్చి పనులు చేయడమేంటని నిలదీస్తున్నారు.