»Ram Charan A Rare Honor For Ram Charan But Pawan Is Missing
Ram Charan: రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం!
మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్‌కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. కానీ ఇదే గౌరవాన్ని గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్దని చెప్పడం విశేషం. ఇంతకీ రామ్ చరణ్ అందుకున్న అరుదైన గౌరవం ఏంటి?
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే.. ఇప్పుడో పవర్ ఫుల్ బ్రాండ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రీచ్ అందుకున్న చరణ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు చరణ్. అలాగే ఎన్నో అవార్డ్స్ అందుకొని అరుదైన గౌరవం అందుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సమ్మర్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత సుకుమార్‌తో భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
రీసెంట్‌గానే చరణ్ బర్త్ డే కానుకగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇలా సాలిడ్ లైనప్‌తో దూసుకుపోతున్న చరణ్.. తాజాగా ఓ మరో అరుదైన గౌరవం అందుకోబోతున్నారు. చెన్నై వేల్స్ యూనివర్సిటీ వారు రామ్ చరణ్‌కి గౌరవ డాక్టరేట్‌ని అందించనున్నారు. ఈ నెల 13వ తేదీన చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుక జరగనుంది. ఈ వేడుకలకు రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఇదే వేడుకలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు.
కళారంగంలో అందించిన సేవలకు గాను ఈ డాక్టరేట్‌ను అందిస్తుంటారు. ఈ క్రమంలోనే చరణ్‌కు ఈ అరుదైన గౌరవ దక్కింది. ఈ వేడుకలకు రామ్ చరణ్ తో పాటు.. పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. అన్నట్టు.. గతంలో బాబాయ్ పవన్ కళ్యాణ్‌కి కూడా వేల్స్ యూనివర్సిటీ వారు డాక్టరేట్‌ని అందించారు. కానీ దానిని పవన్ సున్నితంగా తిరస్కరించారు. కానీ ఇప్పుడు అబ్బాయ్ చరణ్‌కి ఇదే గౌరవం దక్కడం విశేషం.