Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఉగాది రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయితే పెరుగుతున్నంత భారీగా తగ్గడం లేదనే చెప్పాలి. సోమవారం దీని ధర రూ.73,555 ఉండగా, మంగళవారం నాటికి రూ.175 తగ్గి రూ.73,380కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.73,380గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సైతం గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుదలను నమోదు చేస్తూ వస్తోంది. మంగళవారం నామ మాత్రంగా రూ.66 తగ్గింది. దీంతో సోమవారం రూ.84,091గా ఉన్న దీని ధర మంగళవారం రూ.84,025కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర స్థిరంగా ఉంది. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,345 డాలర్లు ఉండగా, మంగళవారం కూడా అదే ధరలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 27.85 డాలర్లుగా ఉంది.