Nara Lokesh: జగన్ వల్ల సీఐడీ క్రైమ్ ఇన్వాల్వ్‌మెంట్‌గా మారిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా విమర్శించారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్‌లు తమ ఉద్యోగాన్ని వదిలి జగన్ పోలీస్ సర్వీస్‌గా మారారు. ఐపీఎస్‌లు ఇంతగా బరితెగించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని లోకేశ్ అన్నారు. మా కుటుంబంపై బురద చల్లేందుకు భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. అధికారం పోతుందని తెలిసే ప్రతాలను దహనం చేశారు. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా? జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాని లోకేశ్ అన్నారు. చేసిన నేరానికి మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ మండిపడ్డారు.