»Gmails Summarize This Email Feature Could Arrive On Android Soon
Gmail : ఆండ్రాయిడ్ జీ మెయిల్లో కొత్తగా రానున్న ‘సమరైజ్ ఫీచర్’
వినియోగదారుల సౌలభ్యం కోసం గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు జీమెయిల్లో‘మెయిల్ సమరైజ్’ ఫీచర్ కొత్తగా ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి రానుంది. దీని గురించి తెలుసుకుందాం రండి.
Gmail’s Summarize This Email Feature : ప్రస్తుత తరం యువత అనే కాకుండా పెద్ద వారు కూడా దాదాపుగా జీ మెయిల్‌ని ఉపయోగిస్తున్నారు. అధికారిక ఈ మెయిళ్లతోపాటు, పర్సనల్ ఈ మెయిళ్లను దీని ద్వారా పొందుతున్నారు. ఎక్కువ మంది వాడే ఈ జీమెయిల్లో ఎప్పటికప్పుడు నయా ఫీచర్లు వస్తూనే ఉంటాయి. మరింత యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ కోసం గూగుల్ కంపెనీ అప్డేట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వెబ్‌లో అందుబాటులో ఉన్న ‘మెయిల్ సమరైజ్’ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి రానుంది.
మన జీమెయిల్‌కి(Gmail) కుప్పలు తెప్పలుగా మెయిల్స్ వస్తూ ఉంటాయి. కొన్నింటి నిడివి మరీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిని ఈ కొత్త ఫీచర్ ద్వారా సమరైజ్ చేసుకోవచ్చు. పెద్ద మెయిల్‌ని చిన్నగా షార్ట్ చేసుకుని సారాంశాన్ని ఎంచక్కా చదివేసుకోవచ్చు. అందువల్ల మనకు సమయం ఆదా అవుతుంది. అంతంత పెద్ద మెయిళ్లను చదివే ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఈ ఫీచర్‌ను జెమిని అనే చాట్‌బాట్ సాయంతో తయారు చేస్తోంది గూగుల్. ఇది ఇప్పటికే జీమెయిల్ వెబ్ వెర్షన్లో ఉంది. ఈ మెయిల్ థ్రెడ్స్‌లోని త్రీ డాట్స్ మెనూలో జెమిని యూజర్స్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఈ ఫీచర్ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి సమ్మరైజ్డ్ కంటెంట్‌ను మనం చూడలేం.
ఆండ్రాయిడ్‌లోని జీమెయిల్ యాప్‌లో త్వరలో రానున్న ఈ ఏఐ ఆధారిత స్మార్ట్ ఫీచర్‌ను వాడటం వల్ల మీ సమయం ఆదా అవుతుంది. పెద్ద మెయిల్స్‌ను మీ సమయం మొత్తం వెచ్చించి చదవాల్సిన పనిలేదు. కేవలం సమ్మరైజ్ చేసిన ముఖ్యమైన పాయింట్లు చదువుకుంటే సరిపోతుంది.