National Crush Rashmika Happy Birthday : చలో సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన రష్మిక.. పుష్మ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. త్వరలో పుష్ప2తో సందడి చేయనుంది. ఈ రోజు (మార్చి 5) ఆమె పుట్టినరోజు(Birthday) సందర్భంగా ఆమె సాధించిన ఘనతల గురించి ఓ సారి చదివేద్దాం. ఇప్పటికే తన యాక్టింగ్ తో ఎన్నో అవార్డుల్ని అందుకున్న రష్మికకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 43 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా నిలిచింది.
నెదర్లాండ్స్‌కు చెందిన సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్స్‌లో నిలిచింది. బెస్ట్ ఏషియన్ యాక్ట్రస్ నామినేషన్స్‌లో భారత్ నుంచి ఈ ఘనత అందుకున్న ఏకైక నటి రష్మికనే. తన మొదటి చిత్రంతోనే ఉత్తమ నటిగా సైమా అవార్డును దక్కించుకుంది. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఆ అవార్డును దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ అనౌన్స్ చేసిన ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో రష్మిక చోటు దక్కించుకుంది. ప్రతి ఏటా 30 ఏళ్ల వయసున్న 30 మంది ప్రతిభావంతుల లిస్ట్‌ని ఫోర్బ్స్ విడుదల చేస్తుంది. అందులో రష్మిక అగ్ర స్థానంలో ఉంది.
హీరోయిన్గా బిజీ బిజీగా ఉన్న రష్మిక(Rashmika) పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఉంది. మన దేశంలోనే కాకుండా జపాన్‌కు చెందిన ఒనిట్సకా టైగర్ ప్యాషన్ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్‌గా నియమితురాలైన తొలి భారతీయురాలు రష్మికనే. టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డులకు రష్మిక హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ ఆమెకు ఘన స్వాగతం దక్కింది. ఇండియా నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీ రష్మికనే కావడం విశేషం.