నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. గత ఐదు రోజులుగా 58.5 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. పలమనేరు నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా యాత్ర సాగింది. లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీ దిగేందుకు జనాలు పోటీలుపడ్డారు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళలు దిష్టి తీసి, తిలకం దిద్ది, హారతి పట్టారు. నియోజకవర్గంలో వ్యవసాయ భూములను లోకేశ్ పరిశీలించారు. పొలాల్లో పనిచేస్తున్న కూలీలతో మాట్లాడారు.
ఆరవ రోజు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర షెడ్యూల్
-ఉదయం-8.00కు కమ్మనపల్లె సమీపంలోని కస్తూరిబా స్కూల్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం. -ఉదయం-10.20కు బెల్లుపల్లి క్రాస్ వద్ద వాల్మీకి సామాజికవర్గం ప్రతినిధులతో సమావేశం -ఉదయం-11.50కు కొలమసానిపల్లె పెట్రోలు బంకు సమీపంలో మహిళలతో సమావేశం -మధ్యాహ్నం-1.05కు గొల్లపల్లి సమీపంలో భోజన విరామం -సాయంత్రం-5.45కు గొల్లపల్లి సమీపంలో ఎస్సీలతో సమావేశం -సాయంత్రం-6.30కు రామాపురం ఎమ్మెస్ హాస్పిటల్ ఎదుట గల విడిది కేంద్రంలో బస.