ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉందని, గత కొన్ని రోజులుగా ఉదయం, సాయంకాలం వేళల్లో తీవ్రమైన చలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలు దంచి కొడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజులుగా వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలల్లో భారీ గాలులు వీస్తాయని, రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.