ఏపీ(AP)లో మరో 3 రోజులు భారీ వర్షాలు(Rain) కురవనున్నట్లు వాతావరణ శాఖ(Weather department) వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానం మీదుగా ఈశాన్య గాలులు వీస్తున్నాయని, వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్(Weather Report) రిలీజ్ చేసింది.
ఈదురగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather department) వెల్లడించింది. గోదావరి జిల్లాల ప్రజలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలు చెట్ల కింద ఉండకూడదని, అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఏప్రిల్ 25వ తేది వరకూ ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather department) వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాన, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ద్రోణి విస్తరించిందని, దీనివల్ల తేమ గాలులు ఎక్కువగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఎండలు కూడా పలు ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటాయని, వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం కూడా ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ(Weather department) తెలిపింది.