ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్సంగ్ విడుదల చేసిన కొత్త ఫోన్ గెలాక్సీ ఏ55కి సంబంధించి ధర, ఫీచర్ల వివరాలను వెల్లడించింది. ఆ వివరాలు ఏంటో చదివేద్దాం రండి.
Samsung Galaxy A55 price : ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్సంగ్ ఇటీవలే గెలాక్సీ ఏ55 5జీని ఇంటియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, ఫీచర్ల వివరాలను వెల్లడించింది. మరి ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
* శామ్సంగ్ గెలాక్సీ ఏ55 (Samsung Galaxy A55) మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ లీలాక్ ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్లను తీసుకొచ్చింది.
* దీనిలో మూడు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు ఉన్నాయి. 8జీబీ ర్యామ్ + 128జీబీ, 8జీబీ + 256జీబీ, 12జీబీ+ 256 జీబీ కాన్ఫిగరేషన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.36,999, రూ.39,999, 42,999గా ఉన్నాయి.