భారతీయ స్టేట్ బ్యాంక్‌పై సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల విషయంలో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.
Electoral Bonds: భారతీయ స్టేట్ బ్యాంక్‌పై సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల విషయంలో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దీనిపై ఆ బ్యాంక్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను ఎస్బీఐ తమకు సమర్పించలేదని ఈసీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బ్యాంకుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాండ్ల నంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారన్నది స్పష్టంగా తెలియడం లేదు. అన్ని వివరాలను వెల్లడించాలని మేం తీర్పులోనే పేర్కొన్నా.. మీరు ఎందుకు ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది. దీనిపై బ్యాంక్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. ఇంతలో తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను సోమవారానికి ఈసీకి అందజేయాలని తెలిపింది. బాండ్ల నంబర్లతో రాజకీయ పార్టీలకు ఏ దాత ఎంత విరాళం ఇచ్చారనేది తెలుస్తుంది.