»Petrol And Diesel Prices Slashed By Rs 2 Per Litre From Today
Petrol price : నేటి నుంచి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సార్వత్రిక ఎన్నికలు ముందున్న వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని స్వల్పంగా తగ్గించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వీటి ధరలు ఎంత ఉన్నాయంటే..
Petrol and Diesel prices slashed : పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటి ధరలు ప్రస్తుతం రెండు రూపాయల మేర తగ్గాయి. ఈ తగ్గుదల శుక్రవారం ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పెట్రోలు ధర రూ. 2.49 తగ్గి రూ. 109.31కి చేరింది. ఇక లీటరు డీజిల్ ధర రూ. 2.34 తగ్గి రూ. 97.15కి చేరింది. నెల్లూరులో లీటరు పెట్రోలు ధర రూ.110,06గా, డీజిల్ ధర రూ.97.82గా ఉంది. అలాగే పశ్చిమ గోదావరిలో పెట్రోలు రూ.109.89గా కొనసాగుతోంది. ఇంకా డీజిల్ రూ.97.69గా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో లీటరు పెట్రోల్ ధర రూ. 109.58గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ. 97.37గా ఉంది. ఇక కర్నూల్లో పెట్రోల్ ధర(Petrol price) రూ. 109.58గా ఉంది. వైజాగ్లో ఈ రేటు రూ. 108.29గా కొనసాగుతోంది. కర్నూల్, వైజాగ్లో లీటరు డీజిల్ ధరలు వరుసగా రూ. 97.67, రూ. 96.17గా ఉన్నాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు రూ.2.25 తగ్గాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41గా ఉంది. లీటరు డీజిల్ ధర(Diesel prices) రూ. 2.17 తగ్గి రూ. 95.65గా ఉంది. వరంగల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 106.99గాను, యాదాద్రి భువనగిరిలో రూ. 107.49గాను ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లీటరు డీజిల్ ధర వరుసగా రూ. 95.25, రూ. 95.69గా కొనసాగుతున్నాయి.