»Interesting Facts About Miss World Krystyna Pyszkova
Krystyna Pyszkova: మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికరమైన విషయాలు
మిస్ వరల్డ్- 2024 విన్నర్ క్రిస్టినా పిస్కోవా అంటే అందరికి తెలుసు కానీ ఆమె గురించి అందరూ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. తన గురించి తెలిసి చాలా మంది మనిషే కాదు మనసు కూడా అందమే అంటున్నారు.
Krystyna Pyszkova: మిస్ వరల్డ్- 2024(Miss World- 2024) క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszkova) ఇప్పుడు హాట్ టాపిక్. 111 దేశాల సుందరీమణులను ఓడించి కిరీటాన్ని దక్కించుకుంది. ముంబైలో జరిగిన 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ కాంపిటిషన్లో విజయం సాధించిన క్రిస్టినా గురించి చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. తన గురించి తెలిసి చాలా మంది మనిషే కాదు మనసు కూడా అందమే అంటున్నారు.
క్రిస్టినా పిస్కోవా చెక్ రిపబ్లిక్ దేశంలోని ట్రినెక్ నగరంలో జన్మించారు. అక్కడ నుంచి కొన్నాళ్లకు రాజధాని ప్రాగ్‌కు ఆమె కుటుంబం షిఫ్ట్ అయింది.
క్రిస్టినా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. మోడలింగ్‌పై ఆసక్తితో ఈ రంగంలో చేరారు.
లండన్‌లోని ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్లో 2022 సంవత్సరంలో జాయినై ట్రైనింగ్ తీసుకున్నారు.
మిస్ చెక్ రిపబ్లిక్-2022 పోటీల్లో పాల్గొని, మొదటి ప్రయత్నంలోనే కిరీటం దక్కించుకున్నారు.
సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఆమె క్రిస్టినా పిస్కో ఫౌండేషన్ స్థాపించి.. ఎంతోమందికి సేవలను అందిస్తున్నారు.
పేదవిద్యార్థులకు క్రిస్టినా అండగా నిలిచారు. వారికోసం టాంజానియాలో ఓ పాఠశాలను నిర్మించారు.
24 ఏళ్ల ఈ ప్రపంచ సుందరి ఎత్తు 180 సెం.మీ. (5.91 అడుగులు). ఇంగ్లిష్, జర్మన్, పోలిష్ (పోలాండ్), స్లోవక్ (చెక్ రిపబ్లిక్, స్లోవకియా)లో మాట్లాడగలరు.
మ్యూజిక్, ఆర్ట్‌పై ప్యాషన్. ఫ్లూట్, వయొలిన్ ప్లే చేయడం ఇష్టం.