»Deadly Russian Missile Struck 500 Meters From Zelensky And Greek Leaders Convoy
Russian missile : ఉక్రెయిన్ అధ్యక్షుడే లక్ష్యంగా రష్యా క్షిపణి దాడి?
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిత్సటాకోస్ల కాన్వాయ్కి కేవలం 500 మీటర్ల దూరంలో రష్యా క్షిపణి పడింది. దీంతో ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Russian missile Attack : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, గ్రీక్ ప్రధాని(Greek Prime Minister) కిరియాకోస్ మిత్సటాకోస్లు ఒక ప్రాణాంతక దాడి నుంచి క్షేమంగా బయటపడ్డారు. వారి కాన్వాయ్కి సరిగ్గా 500 మీటర్ల దూరంలో రష్యా క్షిపణి పడింది. దీంతో రష్యా… ఉక్రెయిన్ అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడికి దిగిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉక్రెయిన్ పర్యటనకు వచ్చిన కిరియాకోస్ను జెలెన్ స్కీ నగర సందర్శన కోసం తీసుకెళ్లారు. ఆ సమయంలో వారి కాన్వాయ్కి అతి సమీపంలో రష్యా క్షిపణి(missile) పడింది. ఆ పేలుడుతో అక్కడ ఐదుగురు చనిపోయారు. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ దాడిని రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. తాము తమ లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో చేరుకున్నట్లు వెల్లడించింది. అయితే ఇందులో జెలెన్స్కీ(Zelensky) పేరును మాత్రం ఎక్కడా పేర్కొనలేదు.
రెండేళ్ల నుంచి సైనికుల్ని ఉత్సాహపరిచేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధ క్షేత్రాల్లోని సైనికుల దగ్గరకు వరుసగా వెళ్లి వస్తూ ఉంటున్నారు.. విదేశీ నాయకులు వచ్చినా వారినీ తీసుకెళుతున్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా బుధవారం ఈ క్షిపణి దాడి జరగడం గమనార్హం. ఈ విషయమై జెలెన్స్కీ మాట్లాడారు. తామె ఎలాంటి వారిని ఎదుర్కొంటున్నామో తెలుసుకోవాలన్నారు.