తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రూప్ 4 దరఖాస్తుల గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 4 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నా సర్వర్ సమస్య వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని జనవరి 30 తో ముగియనున్న గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 3 వ తేదీ వరకు గ్రూప్ 4 కి అప్లయి చేసుకోవచ్చు. గ్రూప్ 4 లో అదనపు పోస్టులను కూడా జోడించిన విషయం తెలిసిందే. గడువు పెంచాలని నిరుద్యోగుల నుంచి రిక్వెస్ట్ రావడంతో దీనిపై అత్యవసరంగా బోర్డు భేటీ అయింది. దీంతో మరో 4 రోజులు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
8180 పోస్టులకు గాను ఇప్పటికే 8,47,277 మంది దరఖాస్తు చేస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే 58,845 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరి రోజు సోమవారం 34,247 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన నిరుద్యోగులు చాలామంది ఉండటంతో దరఖాస్తు గడువును టీఎస్పీఎస్సీ పొడిగించింది.