KCR : ఇద్దరు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది.
KCR : తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈసారి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులకు ముందస్తుగా సమాచారం అందించి క్షేత్రస్థాయిలో పర్యటించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈరోజు గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరును ఇప్పటికే ప్రకటించారు. తొలి లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును కేసీఆర్ ప్రకటించారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాలోత్ కవిత పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైంది కాబట్టి గెలిచే అవకాశం ఉందని కేసీఆర్ క్యాడర్‌కు చెప్పిన సంగతి తెలిసిందే.