జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. అయితే.. ఈ సినిమాలో ఇప్పటికే ఎన్టీఆర్ కోసం తంగం ఉంది.. మరి ఇప్పుడు శృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరామే?
Devara: ఈ మధ్య దేవర షూటింగ్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే.. లేటెస్ట్గా దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో శృతి మరాఠే కూడా జాయిన్ అయింది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కీలక పాత్ర కోసం గుజరాతీ బ్యూటీ శ్రుతీ మరాఠేని కూడా తీసుకున్నారు. దీంతో లేటెస్ట్ షెడ్యూల్లో జాయిన్ అయింది శృతి.
దేవర సెట్స్‌లో తన కారవాన్‌లో సెల్ఫీ తీసుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. దేవర షూట్ అని తెలిపింది శృతి. దీంతో శృతి మరాఠే కూడా దేవరలో నటిస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. శృతి మరాఠే.. మరాఠీ, తమిళ్లో పలు సినిమాలు చేయగా.. ఇప్పుడు దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న దేవర షెడ్యూల్ పూర్తి కాగానే.. నెక్స్ట్ కేరళ షెడ్యూల్లో సాంగ్ షూట్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
వీలైనంత త్వరగా దేవర షూట్ కంప్లీట్ చేసి.. నెక్స్ట్ వార్2 సెట్స్‌లోకి జాయిన్ అవడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తాడా? లేదా దేవర పార్ట్ 2ని ముందుకి తీసుకొస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. దేవర పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్‌గా థియేటర్లోకి రానుంది. కొరటాల శివ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.