Mohammad Shami: భారత ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ(Mohammad Shami) ఈ సంవత్సరం ఐపీఎల్(IPL 2024) మ్యాచ్‌కు దూరం అయ్యాడు. వరల్డ్ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే కాలుకు గాయం కారణంగా ఈ పేసర్ ఆటకు దూరం అయినట్లు తెలుస్తుంది. వరల్డ్ కప్‌కు ముందే షమీ చీలమండలం గాయంతో సతమతమౌతున్నాడు. అయినప్పటికీ ఆటలో సంచలనమైన బౌలింగ్ ప్రదర్శించారు. ఈ గాయం కారణంగానే 33 ఏళ్ల పేసర్ ఐపీఎల్-2024 సీజన్‌కు దూరం కానున్నాడు.
షమీ సమస్యకు బ్రిటన్‌లో శస్త్రచికిత్స కోసం పంపించనున్నట్లు బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి షమీ జనవరి చివరి వారంలో లండన్‌లో చికిత్స తీసుకున్నాడు. ప్రత్యేకమైన ఇంజెక్షన్లు తీసుకున్నాడు కానీ అవి పనిచేయకపోవడంతో శస్త్రచికిత్స అవసరం అని బీసీసీఐ అధికారులు తెలిపారు. ఐపీఎల్ మార్చిలో ప్రారంభం కానున్న సందర్భంగా గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న షమీ లేకపోవడంతో ఆ టీమ్ ఇప్పుడు ప్రత్యమ్యాయ మార్గాలను వెతుకుతుంది.