VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు బుధవారం స్దానిక 3వ డివిజన్, నారాయణ పురం గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి ఫించన్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారిని పేరుపేరునా పలకరిస్తూ ఫించన్ల పంపిణీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ నిర్వహించామని, పేదల పక్షపాతిగా ఈ ప్రబుత్వం కొనసాగుతుందని తెలిపారు.