Viral : స్మార్ట్ఫోన్లపై ప్రజలకు ఫుల్ క్రేజ్ ఉంది. ఈరోజుల్లో చేతిలో స్మార్ట్‌ఫోన్(Smart phone) లేనివారు చాలా తక్కువ మందే కనిపిస్తారు. ఇప్పుడు అది కొందరికి అవసరంగానూ, ఫ్యాషన్(Fasion)గానూ మారింది. కొంతమంది ఫోన్లకు అడిక్ట్(Adict) కావడం చూసే ఉంటాం. ఫోన్‌పై విపరీతమైన వ్యామోహం పెంచుకుంటున్నారు. ఫోన్ లేకపోతే క్షణం కూడా ఉండలేనంతగా తయారయ్యారు ప్రజలు. డ్రైవింగ్(Driving) చేసేటప్పుడు కూడా చాలామంది తమ ఫోన్లను ఉపయోగిస్తూనే ఉన్నారు. డ్రైవింగ్‌లో ఫోన్లు వాడకూడదని, లేకుంటే ప్రమాదాల(Accident) బారిన పడే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ మహిళ రైలు నడుపుతోంది. రైలు నడుపుతున్నప్పుడు ఆమె తన మొబైల్(Mobile)ను ఉపయోగిస్తోంది. తను పూర్తిగా ఫోన్లో మునిగిపోయింది. ఆమె ముందుకు కూడా చూడలేదు. ఎదురుగా ఇంకో రైలు వస్తోంది. అది ఆమె గమనించలేదు. రైలు తీరా దగ్గరికి వచ్చినప్పుడు తాను నడుపుతున్న రైలును ఆపేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే ఆ రైలు నేరుగా ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టింది. ఆమె సీటు బెల్టు(Seat belt) పెట్టుకోవడంతో చిన్న గాయాలతో బయటపడింది.
ఈ షాకింగ్ వీడియో @clipsthatgohard ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్(Twitter)లో షేర్ చేయబడింది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోను ఇప్పటి వరకు 1 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించగా, 1 లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. అలాగే, ఈ వీడియో చూసిన ప్రజలు భిన్నమైన స్పందనలు ఇచ్చారు.