»Viral News The Dog That Changed From Black To White What Is The Reason
Viral News: నలుపు నుంచి తెలుపుగా మారిన కుక్క.. కారణమేంటంటే?
బొల్లి వ్యాధి కారణంగా ఓ కుక్క తన నలుపు రంగును కోల్పోయింది. రెండేళ్ల వయస్సు నుంచే ఆ కుక్కు వ్యాధి ఉండటంతో క్రమంగా రంగు మారుతూ పూర్తిగా తెలుపు రంగులోకి వచ్చింది.
Viral News: The dog that changed from black to white.. What is the reason?
Viral News: సాధారణంగా ఉసరవెల్లి రంగులు మారుస్తుంటాది. అయితే తనకు ఉన్న వ్యాధి వల్ల ఓ కుక్క నలుపు రంగు నుంచి తెలుపుగా మారింది. బొల్లి అనే వ్యాధి బారిన పడటంతో ఆ కుక్క కేవలం రెండు సంవత్సరాల్లో నలుపు రంగు నుంచి తెలుపు రంగులోకి మారింది. బొల్లి వ్యాధి చర్మం, జుట్టు సహజ రంగును కోల్పోయి పూర్తిగా తెల్లగా మారే పరిస్థితి వస్తుంది. చర్మం, వెంట్రుకలు, నోరు, పెదవులు ఇలా శరీరం మొత్తం రంగు కోల్పోయేలా చేసే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఇది. కుక్కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి బొల్లి అనే వ్యాధితో బాధపడుతుంది.
ఆ కుక్కు వచ్చిన వ్యాధిపై కన్నేసి ఉంచాలని డాక్టర్ చెప్పడంతో అతని యాజమాని పరిశీలించారు. ఆ వ్యాధి కుక్క ఆరోగ్యంపై పెద్దగా ప్రభావాన్ని చూపదు. మొదట కుక్క కళ్లు, ముక్కు, గడ్డం చుట్టూ చిన్న తెల్లని మచ్చలు వచ్చాయి. 9 నెలల తర్వాత కుక్క ముఖం పూర్తిగా మచ్చలతో మారిపోయింది. రెండు సంవత్సరాలకు పూర్తిగా నల్ల రంగు నుంచి తెలుపు రంగులోకి కుక్క మారిపోయింది. నల్లగా ఉన్న కుక్క తెల్లగా మారిపోవడంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.