ఢిల్లీ మెట్రో(Delhi Metro)లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, ఇటీవల మెట్రోలోనూ, బస్సులోనూ సీట్ల కోసం మహిళలు కొట్టుకునే వీడియో (Video) కూడా వైరల్‌గా మారటం చూశాం. అయితే, తాజాగా అలాంటిదే ఇద్దరు యువతుల మధ్య సిగపట్టకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మెట్రోలో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాలు, బికినీలతో ప్రయాణాలు, వింత డ్యాన్స్‌లు వంటివి చేస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యాలకు గురి చేస్తుంటారు. అయితే, తాజాగా ఇద్దరు యువతుల (young womens) మధ్య జరిగిన ఘర్షణ మరోసారి ఢిల్లీ మెట్రోని వార్తల్లో నిలిపింది.
మెట్రోలో ప్రయాణిస్తున్న యువతుల మధ్య అనుకోని ఘర్షణ తలెత్తింది.అదికాస్త తన్నుకునే వరకూ దారి తీసింది. రీసెంట్గా ఇద్దరు యువతులు మెట్రోలో విపరీతంగా ఘర్షణ పడ్డారు. తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు. కారణం ఏమో కానీ ఒక యువతి బూటుతో మరో యువతిని బెదిరించింది. మరో యువతి ఆమెపై చేతిలో వాటర్ ప్లాస్క్(Water flask)తో దాడికి దిగింది. అందులో ఉన్న నీరు ఆమెపై పోసింది. తోటి ప్రయాణికులు శాంతింపచేయడానికి ప్రయత్నించినా ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. గొడవ మధ్యలో ఓ మహిళ తన ప్రత్యర్ధిపై చర్య తీసుకోవాలని ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్ (Communication system) ద్వారా రైలు డ్రైవర్‌కు తన సమస్యను చెప్పుకుంది. యువతుల తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు