దొంగలు(Thieves) ఈమధ్యకాలంలో వరుస దోపిడీ(Roberries)లతో రెచ్చిపోతున్నారు. ఇళ్లకు, బ్యాంకులకు, దేవాలయాలకు కన్నాలు వేస్తున్నారు. ఇప్పుడు వందల మధ్య కూడా అవలీలగా చోరీలు(Thefts) చేసేస్తున్నారు. క్షణాల్లోనే జేబులను ఖాళీ చేసేస్తున్నారు. అయితే దొంగతనం ఎంత సులభంగా చేస్తున్నారో అంతే ఈజీగా పట్టుబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద దొంగతనం జరిగిన వీడియో:
మార్చి 1వ తేదిన ఢిల్లీలోని ఎర్రకోట వద్ద క్షణాల్లో ఓ చోరీ(Theft) జరిగింది. ఓ వ్యక్తి తన బ్యాగులో పెట్టుకుని ఉన్న సొమ్మును ముగ్గురు దొంగలు కాజేశారు. ఆ వ్యక్తి బైక్ లో వెళ్తుండగా దూరం నుంచి అనుసరిస్తూ వెళ్లారు. దారిలో ట్రాఫిక్ సిగ్నల్(Trafic Signal) దగ్గర బైక్ ఆగడంతో బ్యాగు జిప్ తెరచి డబ్బు మొత్తాన్ని తీసుకుని పారిపోయారు. నాలుగు నిమిషాల్లోనే రూ.40 లక్షలను దొంగిలించి(Thefts) ఉడాయించారు.
బైక్(Bike)కు అటు వైపు, ఇటు వైపు రెండు కార్లు ఉన్నాయి. చుట్టుపక్కల చాలా మంది జనం కూడా ఉన్నారు. అయినా కూడా ఏ భయం లేకుండా దొంగలు క్షణాల్లో రూ.40 లక్షలు దోచుకొని(Theft) అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో సీసీటీవీ ఫుటేజీ(CC Footage) ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.38 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బైక్ లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చోరీ(Theft)లకు పాల్పడుతున్నట్లు నిందితులు తెలిపారు. ప్రస్తుతం చోరీ జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.