»Pinchan Kosa%e1%b9%81 Kurci Sahayanto Na%e1%b8%8dici Ve%e1%b8%b7lina Vr%cc%a5ddhuralu 51 5000 Translation Results Translation Result Elderly Woman Who Walks With The Help Of A Chair For Pen
Viral : పింఛన్ కోసం ముసలమ్మ పాట్లు.. జాలిపడుతున్న నెటిజన్లు
ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్(70)(Surya Harijan) అనే మహిళ విరిగిన కుర్చీ(Chair)ని ఆసరాగా చేసుకుని ఎండలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఒడిశా(Odisha) రాష్ట్రంలోని నబరంగ్పూర్ ప్రాంతానికి చెందినది. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలు ఎండల వేడికి అల్లాడిపోతున్నాయి. ఇంత వేడి వాతావరణంలో 70ఏళ్ల వృద్ధురాలు కాళ్లకు చెప్పులు లేకుండా కుర్చీ సాయంతో పింఛన్(pension) కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళ వీడియో చూసి నెటిజన్లు జాలి పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్(70)(Surya Harijan) అనే మహిళ విరిగిన కుర్చీ(Chair)ని ఆసరాగా చేసుకుని ఎండలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరుపేదలకు సాయం చేయడానికి ప్రభుత్వ పథకాలు అమలులో ఉన్నప్పటికీ, సూర్య హరిజన్ కు వివిధ కారణాల వల్ల అందడం లేదు.
సూర్య హరిజన్ పెద్ద కొడుకు జీవనోపాధికి వలసకూలీగా వేరే రాష్ట్రానికి వెళ్లగా.. మరో కొడుకు పశువులను మేపుతూ జీవిస్తున్నాడు. గతంలో ఆమెకు పింఛన్ డబ్బులు చేతికి అందేవి, కానీ ప్రస్తుతం ఆమె బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమె ఎడమ చేయి బొటన వేలిముద్ర కొన్ని సార్లు సరిపోవడం లేదు, దీంతో పింఛన్(pension) డబ్బులు చెల్లించడం సమస్యగా మారుతోందని సదరు బ్యాంక్ చెబుతోంది. 4 నెలలుగా ఆమెకు పింఛన్ అందలేదని, దీంతో ఆమె బ్యాంకు వెళ్లాల్సి రావడంతో ఇలా కుర్చీనే చేతికర్రగా ఉపయోగించుకుని ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ప్రయాణించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అధికార యంత్రాంగం స్పందించింది. బ్యాంక్ మేనేజర్లు ఆమె వేళ్లు విరిగిపోయాయని ఎస్బీఐ జరీగావ్ బ్రాంచ్(SBI Jarigaon Branch) మేనేజర్ చెబుతున్నారు. దీంతో ఆ మహిళకు డబ్బులు తీసుకునే సమయంలో పెద్ద సమస్య తలెత్తింది. త్వరలోనే పరిష్కారం కనుగొంటామని చెప్పారు.
VIDEO | Surya Harijan, a 70-year-old woman from Odisha’s Nabarangpur, had to walk several kilometres barefoot under the scorching sun, using a broken chair as support, to collect her pension money. pic.twitter.com/omWpdUcdVb