గుక్కెడు నీళ్ల కోసం గుండెపగిలేలా ఏడ్చే బతుకులెన్నో మన దేశంలో ఉన్నాయి. కిలోమీటర్ల మేర నడిచి తాగటానికి నీరు తెచ్చుకుని జీవిస్తున్న వారు ఇంకా మన దేశంలో ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఇంకా నీటి సమస్య తాండవిస్తూనే ఉంది. గొంతు తడపడం కోసం ప్రాణాలను బిగపెట్టి పోరాటం చేస్తున్న తల్లులెందరో సుదూర ప్రాంతాల్లో మనకు దర్శనమిస్తారు.
ప్రతీ బీట్ మనల్ని కదిలిస్తుంది. ప్రతీ స్టెప్ మరొకరితో డ్యాన్స్ చేసేలా చేస్తుంది. ఏబీసీడీ డ్యాన్స్ ఫ్యాక్టరీ అనే గ్రూప్ యువతులు చీరకట్టులో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
పొన్నాంబలం(Ponnambalam) చికిత్స తీసుకుంటున్న సమయంలో సాయం కోసం చాలా మందిని సంప్రదించారు. ఇటీవలె ఆయన కోలుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన వైద్యం కోసం రూ.40 లక్షలు ఆర్థిక సాయం చేశారంటూ చెప్పుకొచ్చారు.
దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) ముద్దుల కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.
ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ సందర్భంగా మేకలను బలి ఇచ్చిన కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
కూరగాయలు కొంటున్న వారి దగ్గరకు వెళ్లి ఓ నిమ్మకాయను తీసుకుని దాన్ని ఓ కవర్ లో పెట్టి పక్షి ఎగిరినట్టు ఎగిరేలా చేశాడు ఓ మాంత్రికుడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
బాలీవుడ్ ఫేమస్ డ్యాన్సర్ రాఖీ సావంత్ ఓ పాటకు తన పాకిస్థానీ డ్యాన్స్ పార్ట్ నర్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది.
ఈ మధ్య కాలంలో వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ లలో ఓ కొత్తరకం ట్రెండ్ కొనసాగుతుంది. లైక్ లేదా సబ్ స్క్రైబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్(part time job) చేయాలని ఫోన్లకు మేసేజులు వస్తున్నాయి. అవి చూసి అశా పడ్డారనుకో ఇక అంతే. మొదట లైక్ లేదా సబ్ స్క్రైబ్ చేస్తే రూ.100 లేదా రూ.150 పంపిస్తారు. ఇక తర్వాత అసలు దందా మొదలవుతుంది. ఈ స్కాం ద్వారా తాజాగా ఏపీకి చెందిన ఓ యువతి ఏకంగా 19 లక్షల రూపాయలు పొగొట్టుకుంది.
తాగి పెళ్లి పీటలెక్కిన వరుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వధువు అతడిని పెళ్లి(marriage) చేసుకోవడానికి నిరాకరించింది. ఆ తర్వాత పంచాయతీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది. ఈ సంఘటన ఇటీవల వారణాసిలోని హర్హువాలో చోటుచేసుకుంది.
ప్రమాదవశాత్తు స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించగా..మంటల్లో దాదాపు 20 మంది పిల్లలు మరణించారు.
అన్ని కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ లను పెట్టుకుంటారు . దాని కోసం దాదాపు అందరూ సెలబ్రెటీలనే ఎంచుకుంటారు. వారు అయితే, తమ కంపెనీకి పేరు వస్తుందని వారు భావిస్తుంటారు.. అయితే ఇప్పుడు 'ది యువతీ కలెక్షన్' అనే లగ్జరీ బ్రాండ్ ఇప్పుడు మురికివాడలో పెరిగిన ఓ అమ్మాయికి మోడల్‌గా మారే అవకాశాన్ని కల్పించింది. 14 ఏళ్ల బాలే అందులో విజయం సాధించింది. ఆమె మలిషా ఖర్వా, ఒక లగ్జరీ బ్యూటీ బ్రాండ్ కోసం ఎన్నికైన బాలిక.
జీ20 వేదికపై ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) నాటు నాటు సాంగ్ మారుమోగింది. హీరో రాంచరన్ ఆ పాటపై చిందేశారు.
ఖర్చులను తగ్గించుకునే పనిలో లక్షల మంది ఉద్యోగులను పలు టెక్ కంపెనీలు ఇంటికి పంపుతున్నాయి.
అడవిలో సింహాల వేటను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రతీ జీవి బ్రతకాలనుకుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి మాంసాహార జంతువులు వేటాడకపోతే ఎలా బ్రతుకుతాయని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
మొట్టమొదటిసారి సౌదీ మహిళ అంతరిక్షంలో అడుగుపెట్టనుంది. వీరు స్టెమ్ సెల్ పరిశోధకురాలు రయ్యానా బర్నావి.