మాస్ లేఆఫ్స్ (Mass Layoffs) ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో భారగా ఉద్యోగుల కోత జరిగింది. గత ఏడాది 1056 కంపెనీలలో దాదాపు 1.64 లక్షల మంది ఉద్యోగులను తొలగించారు. 2023లో కేవలం ఐదునెలల్లోనే ఈ సంఖ్యను దాటిపోయి లేఆఫ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య ఉద్యోగులలో ఆందోళనను రేకెత్తిస్తోంది. లేఆఫ్స్ ను ట్రాకింగ్ చేస్తున్న వెబ్ సైట్ layoff.fyi లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఈ ఏడాది 694 కంపెనీలు లేఆఫ్స్ జరిపాయి. ఇందులో వేలల్లో ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది.
2023 మే 18నాటికి ఒక లక్షా 97వేల 985 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు మెటా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితోపాటు అమెజాన్, ట్విట్టర్ లాంటి సంస్థలు కూడా లేఆఫ్స్ ను కొనసాగిస్తున్నాయి. ఎలన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత లేఆఫ్స్ కు తెరతీశారు. ఇప్పటికే భారత్ లో పనిచేసే ట్విట్టర్ ఉద్యోగులనందరినీ ఇంటికిబాట పట్టించారు. మరి కొన్ని రోజుల్లో ఉద్యోగులను తొలగించనున్నట్లు గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ప్రకటించాయి. పునర్వవస్థీకరణ ప్రక్రియలో భాగంగా… ఆయా కంపెనీలు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. భారత్ లో పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చును తగ్గిస్తున్నాయి.