GNTR: జీఎంసీ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల వద్ద మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం టిడ్కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అడవి తక్కెళ్లపాడు, వెంగళాయపాలెంలోని టిడ్కో ఇళ్లల్లో నివాసం ఉంటున్న ప్రజల త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.