బాలీవుడ్ డ్యాన్సర్ రాఖీ సావంత్ తన పాకిస్థానీ డ్యాన్స్ పార్ట్నర్తో కలిసి ‘మేరా దిల్ యే పుకారే’ అనే పాటకు ఆడిపాడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పాడిన ‘మేరా దిల్ యే పుకారే ఆజా’ పాటకు డ్యాన్స్ చేసిన లెక్కలేనన్ని వీడియోలలో, ఇది కొత్తది. ప్రస్తుతం ఆన్లైన్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో రాఖీ సావంత్ తన డ్యాన్స్ పార్ట్నర్ అమీర్ రఫీక్‌తో కలిసి స్టెప్పులు వేసింది. ఈ జంట, వారి కదలికలు మరియు వ్యక్తీకరణలతో నెటిజన్లను అలరించారు.
“తలాబత్ కింగ్ (అమీర్)తో ట్రెండింగ్ డ్యాన్స్” అని రాఖీ సావంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశారు. డ్యాన్స్ వీడియోలో రాఖీ సావంత్ మరియు పాకిస్థాన్‌కు చెందిన అమీర్ రఫీక్ ‘మేరా దిల్ యే పుకారే ఆజా’ రీమిక్స్ ట్యూన్లకు డ్యాన్స్ చేశారు. విజువల్‌గా అద్భుతమైన నృత్య ప్రదర్శన అని వీక్షకులు ప్రశంసలను కురిపించారు.
ఈ వీడియో మే 12న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది మరియు అప్పటి నుండి 2.4 మిలియన్లకు పైగా వీక్షణలతో వైరల్ అయ్యింది మరియు కౌంట్ ఇంకా పెరుగుతూనే ఉంది.
వీడియోకి నెటజన్లు ఎలా స్పందించారంటే…
డ్యాన్స్ బాగుందని కొందరంటే.. ఈ వీడియోలో రాఖీ సావంత్ అందంగా ఉందని మరికొందరు అన్నారు.వావ్ రాఖీ మైండ్ బ్లోయింగ్ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.