»Lions Team Up To Secure Their Meal Pull Warthog From Burrow In South Africa
Lions: అడవి పందిని వేటాడిన సింహాలు.. క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్
అడవిలో సింహాల వేటను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రతీ జీవి బ్రతకాలనుకుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి మాంసాహార జంతువులు వేటాడకపోతే ఎలా బ్రతుకుతాయని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
అడవిలో ఒక జంతువు తన ఆహారం కోసం మరో జంతువుపై ఆధారపడుతుంటాయి. అక్కడ వేట అనేది అతి సాధారణం. అయితే శాకాహార జంతువులు గడ్డీ, పండ్లు లాంటి వాటితో తమ పొట్టను నింపుకుంటే.. మాంసాహార జంతువులు తప్పక వేరే జీవిపై ఆదారపడాల్సిందే. సింహాం లాంటి మృగరాజులు తమ ఆహారాన్ని సమకూర్చుకోవడానికి వేరే జంతువులను వేటాడటం అతి సాధారణం. మనుషులుకు మాత్రం అలాంటి ఘటనలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అందులో భాగంగానే ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
దక్షిణాఫ్రికాలోని థోర్నీబుష్ గేమ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఓ వార్ థాగ్ ( అడవి పంది) ని మూడుసింహాలు కలిసి చంపితిన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఓ వార్ థాగ్ ఒక బొరియలో దాక్కుంది. దాన్ని బయటకు లాగడానికి మూడు సింహాలు ప్రయత్నించాయి. బొరియలో చిక్కుకున్న వార్ థాగ్ బయటకు పారిపోకుండా చుట్టూ సింహాలు ఉన్నాయి. ఆ వార్ థాగ్ ను అతి శక్తివంతంగా మూడు కలిసి పట్టుకున్నాయి. ఎందుకంటే మామూలుగా వార్ థాగ్ అతి శక్తివంతమైనది. ఒక్క గుద్దుకు మనిషి చిటికెలో ప్రాణం విడిచేస్తాడు. అలాంటి వార్ థాగ్ ను ఆపేందుకు మూడు ఆడసింహాలు కలిసి పట్టుకున్నాయంటే దాని బలం ఎంతో అంచనావేయాల్సిందే.
బొరియనుంచి వార్ థాగ్ ను బయటకు లాగి మూడు సింహాలు తమ ఆహారాన్ని సమకూర్చుకున్నాయి. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వీడియో యూట్యూబ్ లో విడుదలైన కొద్దసేపట్లోనే 3.7 లక్షల వీక్షణలు, 1,100కు పైగా లైక్ లు చేయబడ్డాయి. కొంతమంది నెటిజన్లు అడవిలో ఉండటం కష్టమని కామెంట్ చేస్తుండగా.. జీవితం, మరణం అనేది టగ్ ఆఫ్ వార్ ఆట కాదని కామెంట్ చేస్తున్నారు. అయితే ఒక మాంసాహార జంతువు మరో జంతువుపై దాడి చేసి తన ఆహారాన్ని సంపాదించుకపోకపోతే అది మరణిస్తుంది. ఈ వేట అనేది జంతువులకు తప్పని విధి.