»Nypd Officer Who Was Shot While Washing Car Dies After 33 Years In A Coma
Police officer: 20 డాలర్ల కోసం గొడవ.. 33ఏళ్లుగా కోమాలో ఉండి..!
ఓ పోలీస్ అధికారిని పలువురు దుండగులు 20 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించారు. ఆ క్రమంలో అతను ఇవ్వలేదు. దీంతో కోపంతో వారిలో ఓ వ్యక్తి అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ క్రమంలో కోమాలోకి జారుకున్న ఆ అధికారి ఇటీవల మరణించారు. ఈ సంఘటన 1990లో చోటుచేసుకుంది.
20 డాలర్ల కోసం ఓ పోలీసు అధికారి(police officer) తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దుండగులు డబ్బు ఇవ్వాలని ఓ పోలీసు అధికారిని బెదిరించగా, అందుకు అతను నిరాకరించాడు. అంతే ఇంకేముంది తుపాకీ గుళ్లు అతని శరీరంలోకి దూసుకుపోయాయి. అప్పటి నుంచి దాదాపు 33 సంవత్సరాలపాటు కోమాలో ఉన్న ఆయన, చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన న్యూయార్క్(NYPD) లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1990 జనవరి 16వ తేదీన న్యూయార్క్ లో పోలీస్ అధికారి(police officer) ట్రాయ్ ప్యాటర్సన్ తన ఇంటి బయట కారు శుభ్రం చేసుకుంటున్నారు. అదే సమయంలో కొందరు దుండగులు అక్కడకు వచ్చి, ఆయనను డబ్బులు ఇవ్వమని బెదిరించారు. 20 డాలర్లు ఇవ్వాలని అడిగారు. అందుకు ఆయన నిరాకరించారు.
దీంతో దుండగుల్లో ఒకడైన ఓ 15ఏళ్ల యువకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. దాదాపు 33 ఏళ్ల పాటు కోమాలో ఉన్న ఆయన ఇటీవల తుదిశ్వాస(death) విడిచారు. అయితే.. ఆయన మృతికి కారణమైన ముగ్గురు దుండగులు ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని అధికారులు చెప్పారు.