»Leopard Zooms Past Lonavala Tracks Amid Fog Some Think Its Tiger Watch Video
Tiger Video: రైలు పట్టాలపై పులి.. ప్రాణాల కోసం పరిగెత్తిన వ్యక్తి
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు అది పులి మరేదో జంతువని కామెంట్ చేశారు. క్లిప్‌ను మొదట పోస్ట్ చేసిన లోనావాలా టూరిజం డిపార్ట్ మెంట్ కూడా ఉదయం 7 గంటలకు చిరుతపులి కనిపించిందని స్పష్టం చేసింది.
Tiger Video:మహారాష్ట్రలోని సుందరమైన లోనావాలాలో పొగమంచు మధ్య రైల్వే ఘాట్ సెక్షన్లో ఒక ‘పులి’ సంచరిస్తూ కనిపించింది. ఇంతలో అటుగా రైలు పట్టాలపై నడుస్తున్న వ్యక్తిని ప్రాణాల కోసం పరుగెత్తేలా చేసింది. ఈ పులి ఎవరికీ హాని చేయలేదు, దానిని చూసిన బాటసారులు మాత్రం హడలెత్తిపోయారు. దానిని చూసిన అతను వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంకించుకున్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు అది పులి మరేదో జంతువని కామెంట్ చేశారు. క్లిప్‌ను మొదట పోస్ట్ చేసిన లోనావాలా టూరిజం డిపార్ట్ మెంట్ కూడా ఉదయం 7 గంటలకు చిరుతపులి కనిపించిందని స్పష్టం చేసింది. వినియోగదారు ఒక నెల వ్యవధిలో ఇది రెండవ ఘటన ఇలా చిరుత కనిపించడమని నెటిజన్ కామెంట్ చేశారు.
Leopard hain, and why should it be a surprise there are leopards in the ghats. Its their home
హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ‘భారతదేశంలో చిరుతలు, సహ-ప్రెడేటర్లు, మెగాహెర్బివోర్స్ స్థితి-2018′ నివేదికలో దేశంలోని 12,852 చిరుతపులులలో, 1,690 మహారాష్ట్రలో ఉన్నట్లు అంచనా. 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, మధ్యప్రదేశ్ (3,421), కర్ణాటక (1,783) తర్వాత చిరుతపులుల జనాభాలో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. కొన్నేళ్లుగా ఈ సంఖ్య గణనీయంగా చిరుతల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.