Health Tips: ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరూ చల్లని నీరు తాగాలని ఉబలాటపడిపోతూ ఉంటాం. చల్లటి నీరు గొంతులో పోసుకుంటే కలిగే ఆనందమే వేరు. చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ, ఈ చల్లని నీరు మనకు తెలియకుండానే మనకు పెద్ద ముప్పు తీసుకువస్తుందని ఏరోజైనా ఊహించారా? నమ్మసక్యంగా లేపోయినా ఇది నిజం.
చల్లని నీరు తాగితే గుండె నొప్పి ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరికీ కాకపోయినా, ఆల్రెడీ హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందట. జ్వరంతో బాధపడేవారు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే వారిలో చల్లని నీరు శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించిన అనుభూతి కలుగుతుంది. కానీ, ఇప్పటికే గుండె జబ్బులోత బాధపడేవారిలో మాత్ర హార్ట్ బీట్ లో హెచ్చతగ్గులు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరును సేవించగానే ముఖ్యంగా హృద్రోగుల్లో కొద్ది క్షణాల్లోనే గుండె పోటు వంటి సీరియస్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
రూమ్ టెంపరేచర్‌కు సరిపోయే రీతిలోనే హైడ్రేట్ కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనానంతరం గోరువెచ్చటి నీరు తీసుకుంటే మేలని, అది జీర్ణక్రియకు దోహదపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రూం టెంపరేచర్‌తో కూడిన నీటిని తీసుకుంటే శరీరంలో కీలక అవయవాలు సజావుగా పనిచేయడంతో పాటు శరీరం అంతటికీ పోషకాలు, ఆక్సిజన్ సమకూరుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంతో పాటు గుండె కొట్టుకునే వేగం నిలకడగా ఉంటుందని వైద్య నిఫుణులు సూచిస్తుందని అన్నారు.