Hritik Roshan : రామ్ చరణ్‌ను మించిపోయిన స్టార్ హీరో!
Hritik Roshan : ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ సమయంలో భార్య ఉపాసనతో కలిసి అమెరికా టూర్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. లాస్ ఎంజిల్స్‌లో షాపింగ్, బోటింగ్‌తో షికారు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలోను పోస్ట్ చేసింది.
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ సమయంలో భార్య ఉపాసనతో కలిసి అమెరికా టూర్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. లాస్ ఎంజిల్స్‌లో షాపింగ్, బోటింగ్‌తో షికారు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలోను పోస్ట్ చేసింది. అందులో ఉపాసన సరదాగా నడుస్తుండగా.. ఆమె వెనుక షాపింగ్ బ్యాగ్స్ మోస్తూ కనిపించాడు చరణ్. దాంతో అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఎంత గ్లోబల్ స్టార్ అయినా కూడా.. భార్య బ్యాగులు మోయాల్సిందేనని సరదాగా కామెంట్స్ చేశారు. అయితే ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో చరణ్ అలా చేయాల్సి వచ్చింది. కానీ మీమర్స్ మాత్రం.. సందర్భం వచ్చినప్పుడల్లా ఫన్నీగా చరణ్ బ్యాగులు మోసిన ఫోటోని వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఓ స్టార్ మాత్రం రామ్ చరణ్‌ని మించిపోయాడు. ఏకంగా ప్రియురాలి చెప్పులు మోసి హాట్ టాపిక్‌గా మారాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కి సంబందించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత సబా ఆజాద్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నీతూ అంబానీ కల్చలర్ సెంటర్ ప్రారంభోత్సవానికి లవర్‌తో కలిసి వచ్చాడు హృతిక్. అక్కడ సబా ఆజాద్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్‌తో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలని అమిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ ఫోటోలో హృతిక్ రోషన్ చెప్పులు పట్టుకొని కనిపించాడు . దీంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. దీని పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. గర్ల్ ఫ్రెండ్ చెప్పు మోయాల్సిందేనా.. అంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా హృతిక్ రోషన్ లవర్ చెప్పులు మోశాడనేది.. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.