విడాకులతో నరకం నుంచి బయటపడింది.. అందుకే ఈ ఫోటో షూట్..!
ఈ మధ్య ప్రతి ఒక్కరూ తమ పెళ్లి, మెటర్నిటీకి ఫోటో షూట్ లు చేయించుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. అయితే, భిన్నంగా ఓ బుల్లితెర నటి విడాకుల ఫోటో షూట్ చేయించుకుంది. తమ పెళ్లి ఫోటోలు చించేస్తూ ఆనందంగా నవ్వుతూ ఆమె చేయించుకున్న ఫోటోషూట్ వైరల్ గా మారింది. విడాకులను ఇంత బాగా ఎంజాయ్ చేస్తారా అంటూ చాలా మంది నోర్రెళ్ల పెట్టారు. అయితే, ఆమె విడాకులను అలా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. అదే ఆమె పడిన కష్టం. వైవాహిక జీవితంలో తాను పడిన నరకానికి స్వస్తి పలికినందుకు సంతోషాన్ని ఆమె అలా వ్యక్తం చేసింది. తాను అలా చేయడానికి గల కారణాన్ని ఆమె స్వయంగా వివరించింది.
తమిళ టెలివిజన్‌లో నటిస్తున్న షాలిని, మీడియా రంగంలో పనిచేయడానికి దుబాయ్‌కి షిఫ్ట్ అయింది. 2015లో, ఆమె రియాజ్ మహ్మద్ పరిచయం అయ్యాడు. కుటుంబాన్ని విడిచిపెట్టి దుబాయ్‌లో షాలినితో సన్నిహితంగా మెలిగిన రియాజ్.. మెల్లగా షాలిని ప్రేమ వలలో పడేశాడు. రియాజ్‌కి అప్పటికే వివాహమై మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇవేమీ పట్టించుకోని షాలిని.. రియాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రియాజ్ కోసం ఇస్లాం మతంలోకి మారిన షాలిని తన పేరును సారా మహమ్మద్ రియాజ్ గా మార్చుకుంది. పెళ్లయిన కొద్ది రోజుల్లోనే మొదలై నరకయాతన అనుభవించింది. విపరీతంగా మద్యం సేవించిన రియాజ్.. షాలిని చేసే చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపి ఆమెను కొట్టేవాడు. రాక్షస మనస్తత్వం ఉన్న రియాజ్.. షాలిని గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమెపై మోజు పెంచుకున్నాడు. అతను చెప్పినట్లుగా మాత్రమే చేయాలని ఇబ్బంది పెట్టేవాడు. ఉద్యోగం మాన్పించాడు. సోషల్ మీడియాకు దూరం చేశాడు. ఆమె ఫోన్ నెంబర్ మార్చేశాడు. కనీసం తన తల్లిదండ్రుతో కూడా ఫోన్ మాట్లడకుండా చేశాడు.
‘తన నవ్వు కూడా భరించలేకపోయేవాడు. దాంతో నవ్వడం కూడా మరిచిపోయాను. నేనెప్పుడూ బురఖా వెనుకా, తెర వెనుకా ఉండేవాదానన్ి. అతని దెబ్బలు తట్టుకోలేక నేను పార్కింగ్ లాట్ దగ్గరకు పరిగెత్తి నిలబడేదాన్ని. అతని దెబ్బకి నా ఒళ్ళంతా వాచిపోయేది. ఇంతలో ఓ కూతురు పుట్టింది. ఆమె వచ్చిన తర్వాత కూడా నా జీవితంలో మార్పు రాలేదు. అతని తాగుబోతు, అనుమానాస్పద ప్రవర్తనతో నేను విసిగిపోయాను. ఇలా ఒకరోజు చిన్న విషయానికి గొడవ మొదలైంది. అతను నన్ను కొట్టడం చూసి నా కూతురికి షాక్ అయ్యింది. కాలు పట్టుకుని కొట్టవద్దని చెప్పినా రియాజ్ మనసు కరగలేదు.’ ‘నా కూతురి కన్నీళ్లు, భయం నన్ను రియాజ్‌ని విడిచిపెట్టేలా చేశాయి. ఇక నీతో కలిసి జీవించలేనని చెప్పాను. నేను విడాకులు తీసుకునే వరకు అతనితోనే ఉన్నాను. ఇల్లు వదిలి రోడ్డు మీద నిలబడడం నాకు ఇష్టం లేదు. విడాకులు తీసుకుని నా కూతురితో ఇండియా తిరిగొచ్చాను. ’ అని ఆమె చెప్పారు. తనలాంటి కష్టాల్లో ఉన్న వారికి ఓదార్పునిచ్చి ధైర్యం చెప్పేందుకు ఈ వినూత్న కాన్సెప్ట్ ఫోటో షూట్ చేశామని షాలిని చెప్పారు.