ఈరోజుల్లో ఎక్కడ చూసినా కోతులే కనిపిస్తున్నాయి. ఇదివరకు అడవుల్లోనే కోతులు కనిపించేవి. కానీ.. ఇప్పుడు మాత్రం అడవులను వదిలేసి కోతులు ఊళ్ల మీద పడ్డాయి. ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయి. దొరికింది దొరికినట్టుగా అందుకొని పారిపోతున్నాయి. కొందరు కోతులను చూస్తేనే భయపడతారు. అవి చేసే చేష్టలు కూడా అలాగే ఉంటాయి. ఒంటరిగా కోతులు ఉన్న చోటుకు వెళ్తే ఇక అంతే. అన్నీ మీద ఎగబడటం ఖాయం. అందుకే కోతులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
అవన్నీ కోతుల గురించి తెలిసిన వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటారు కానీ.. కోతుల గురించి తెలియని చిన్నారుల పరిస్థితి ఏంటి. అమాయకంగా ప్రవర్తించే చిన్నారుల పరిస్థితి ఏంది. ఓ చిన్నారికి తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ చిన్నారి ఒక చోట కూర్చొని ఉండగా.. అక్కడికి కొన్ని కోతులు వచ్చాయి. ఒక దాని తర్వాత మరొకటి రావడం.. ఆ చిన్నారిని పట్టుకొని తడమడం చేశాయి. ఆ చిన్నారి కూడా అవి కోతులు అనే విషయం మరిచిపోయి వాటితో ఆడుకోవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత మరికొన్ని కోతులు కూడా వచ్చి తనతో చిలిపిగా ప్రవర్తించడం ప్రారంభించాయి. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ తర్వాత ఏమైంది. కోతులు ఆ చిన్నారిని ఏమైనా చేశాయా? లేక వెంటనే ఆ చిన్నారిని అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులు తీసుకెళ్లారా అనేది మాత్రం తెలియదు. దానికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.