»A Student Who Wrote Her 10th Board Exam While Lying In An Ambulance
SSC EXams: అంబులెన్స్‌లో పది పరీక్షలు రాసిన విద్యార్థిని
ఓ విద్యార్థి పదో తరగతి(SSC) పరీక్షలను అంబులెన్స్(Ambulance)లో రాసింది. ముంబైకు చెందిన విద్యార్థి సోమవారం అంబులెన్స్ లో పది పరీక్షలు రాయాల్సి వచ్చింది. ముబాషిరా సాదిక్ సయ్యద్(Mubaashiraa saadik) అనే బాలిక ఎస్ఎస్సీ(SSC) పరీక్షలు రాస్తోంది. శుక్రవారం మొదటి పరీక్షకు ఆ విద్యార్థిని హాజరైంది. అయితే ఆ పరీక్ష రాసి ఇంటికెళ్తుండగా ఊహించని విధంగా ఆమెకు కారు ప్రమాదం చోటుచేసుకుంది.

ఆ కారు ప్రమాదం(Car Accident)లో ముబాషిరా సాదిక్ సయ్యద్ గాయపడింది. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రి(Hospital)లో చేర్చి చికిత్స చేస్తున్నారు. శస్త్ర చికిత్స చేయడంతో ఆమె నడవటానికి వీల్లేదని వైద్యులు సూచించారు. దీంతో ఆమె నడవలేని స్థితిలో ఉన్నా పరీక్షలు(Exams) రాయాలనుకుంది.
అంబులెన్స్(Ambulance)లోనే పరీక్షసెంటర్ కు విద్యార్థిని హాజరైంది. అంబులెన్స్‌లోని బెడ్ మీదనే ఉండి పది పరీక్షలు రాసింది. ఈ తరుణంలో విద్యార్థిని ముబాషికా సాదిక్ సయ్యద్(Mubaashiraa saadik) మీడియాతో మాట్లాడింది. తన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాను పరీక్ష రాస్తున్నానని, తనకు అండగా నిలిచి పరీక్ష రాసేలా చేశారని ధన్యవాదాలు తెలిపింది. అలాగే తనకు అండగా నిలిచిన తన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసింది. ప్రస్తుతం బాలిక అంబులెన్స్ లో పరీక్ష రాస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.