NRML: దిలావర్పూర్ మండలం గుండంపల్లి, దిలావర్పూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండంపల్లి గ్రామంలోని మహిళలు రైతులు గెలవాలి వ్యవసాయం నిలవాలి అంటూ గురువారం ముగ్గులు వేసి తమ నిరసనను తెలిపారు. మహిళలు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.