HYD: లడ్డూను కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ నాయకులతో కలిసి ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూని అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు.