NRML: నర్సాపూర్ (జి )మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆస్పత్రి నందు అంగన్వాడీ సామ్, మామ్ చిన్నారులకు వైద్య, ఆరోగ్య పరీక్షలను పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ విజయానంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బలహీనంగా ఉన్న చిన్నారులను గుర్తించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని, పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.