BHNG: భవన నిర్మాణ కార్మికులంతా వెల్ఫేర్ బోర్డు రక్షణ కోసం సంఘాలకు, జెండాలకు అతీతంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ విజ్ఞప్తి చేశారు. చిట్యాలలో సీఐటీయూ ఆధ్వర్యంలో వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని కోరుతూ సంతకాల సేకరణ నిర్వహించారు. 23న హైదరాబాద్లో లేబర్ కమిషనర్ ఆఫీస్ వద్ద నిర్వహించనున్న ధర్నా జయప్రదం చేయాలన్నారు.