CTR: చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ పీ.నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు నగరంలో ఆక్రమణలు తొలగిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని అనధికార దుకాణాలు, తోపుడు బండ్లు, తదితర వాటిని తొలగించినట్లు అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర మంగళవారం తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారి శుభప్రద, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.