జిడ్డు చర్మం ఉన్నవారికి రకరకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. అయితే చర్మంలోని జిడ్డుదనాన్ని తగ్గించేందుకు ఇంటి చిట్కాలను సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. వెనిగర్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని స్ర్కబ్ చేసుకోవాలి. ఓట్స్ లేదా బాదం పొడిలో కలబంద గుజ్జు, తేనె కలిపి మర్దనా చేసుకోవాలి. గుడ్డు తెల్లసొన, తేనె, శెనగపిండి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంలోని జిడ్డు సహజంగా తగ్గుతుంది. మృతకణాలు తొలగిపోయి.. చర్మం మృదువుగా మారుతుంది.