చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలా అని రోజూ మాంసం తింటే ఈ వ్యాధి రావడం పక్కా అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ మాంసం, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్ తీసుకునే వారు నరాల సమస్యతో బాధపడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. దీని వల్ల ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే.. పండ్లు, కూరగాయలు, గింజలు తినే వ్యక్తులకు నరాల సమస్య లేదని వివరించారు.