ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మరింత సమర్థంగా నిర్వహించడం, ఖర్చులను నియంత్రణ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కేంద్రం విలీనం చేయాలని చూస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ప్రక్రియ జరగ్గా.. నాలుగో దఫా ఏకీకృత ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. దీంతో ప్రస్తుతం ఉన్న గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధమైంది.